అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలు అడిగిన కాలేజీలను ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. విజిలెన్స్ దాడులతో యాజమాన్యాలను భయపెడుతోందని ఆరోపించారు.
హైదరాబాద్ నల్లకుంటలోని శంకర మఠాన్ని బుధవారం ఉదయం బండి సంజయ్ (Bandi Sanjay) సందర్శించారు. శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులు, యాజమాన్యాల భవిష్యత్‌తో చెలగటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని హెచ్చరించారు. పెండింగ్ ఫీజులన్నీ చెల్లించేవరకు కాలేజీలకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగవద్దని సూచించారు.
Bandi Sanjay | బీహార్‌కు డబ్బు పంపుతున్నారు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) పైసలు ఇక్కడి నుంచే పంపుతున్నారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థుల బకాయిలు చెల్లించలేరా అని ప్రశ్నించారు. తక్షణమే రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బకాయిల కోసం విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలతో కలిసి ఆందోళనలు చేపడుతామన్నారు. మంత్రులను రోడ్లపై తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.
Bandi Sanjay | జూబ్లీహిల్స్‌లో బీజేపీదే గెలుపు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (Jubilee Hills by-Election) బీజేపీ గెలుస్తుందని సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదన్నారు.
