Homeజిల్లాలునిజామాబాద్​MP Arvind | ధాన్యం కొనుగోలు సమస్యను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: ఎంపీ అర్వింద్​

MP Arvind | ధాన్యం కొనుగోలు సమస్యను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: ఎంపీ అర్వింద్​

ప్రతిసారి ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎంపీ అర్వింద్​ అన్నారు. నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : MP Arvind | సుమారు 12 ఏళ్లుగా ప్రతిసారి ధాన్యం కొనుగోలు సమస్య ఏర్పడుతోందని, అయినా ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. గన్నీ బ్యాగుల కొరత, లేబర్ కొరత, ట్రాన్స్​పోర్టేషన్​ ఇలా ప్రతి అంశంలో సమస్యలు ఏర్పడినా పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వం అలాగే చేసిందన్నారు. ప్రతిసారి అకాలవర్షాలతో ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే వారు లేరన్నారు. రాష్ట్రం నుంచి ఎఫ్​సీఐ 93 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారం పూర్తిస్థాయిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం (State Government) మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తామని ప్రకటించినా అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు.

MP Arvind | ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇవ్వకుండా..

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇవ్వకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) కాలయాపన చేస్తోందని ఎంపీ అన్నారు. కేవలం రాజకీయం కోసం బీసీ రిజర్వేషన్లు అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్​ విడుదల చేయాలన్నారు. కేసీఆర్​ (KCR) సీఎం రేవంత్ రెడ్డి ములాఖత్​ అయ్యారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్​కు గులాంగిరి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలోనూ నిజామాబాద్ మార్కెట్ యార్డు నిధులను సిరిసిల్లకు తరలించారన్నారు.

MP Arvind | జూబ్లీహిల్స్​ ఉపఎన్నిక

జూబ్లీహిల్స్ ఎన్నికల (Jubilee Hills Election) వ్యవహారాన్ని బీజేపీకి సంబంధించి తమ సీనియర్లు చూసుకుంటారని అర్వింద్​ చెప్పారు. జూబ్లీహిల్స్​లో కల్వకుంట్ల కుటుంబం డ్రగ్స్​ను పెంచి పోషించిందన్నారు. గత పదిహేళ్లుగా ఏమీ అభివృద్ధి చేయకుండా ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు.

MP Arvind | మాధవనగర్​ ఆర్​వోబీ..

మాధవనగర్ ఆర్వోబీకి సంబంధించి ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసినట్లు ఎంపీ అర్వింద్​ తెలిపారు. రూ.14 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అందులో రూ.10 కోట్లు కేంద్రానివేనని స్పష్టం చేశారు. వాటిని కూడా విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతనకర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News