Homeతాజావార్తలుMinister Azharuddin | మొక్కుబడి మంత్రి.. అజారుద్దీన్​కు శాఖలు కేటాయించని సర్కారు.. ప్రమాణ స్వీకారానికే పరిమితం..!

Minister Azharuddin | మొక్కుబడి మంత్రి.. అజారుద్దీన్​కు శాఖలు కేటాయించని సర్కారు.. ప్రమాణ స్వీకారానికే పరిమితం..!

Minister Azharuddin | ఆయన మంత్రి.. కానీ, శాఖ లేదు. ఎలాంటి బాధ్యతలు లేవు.. అమాత్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాననే సంబరం మాత్రమే ఉంది..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Minister Azharuddin | ఆయన మంత్రే minister.. కానీ, ఏ శాఖ portfolio అప్పగించలేదు. ఎలాంటి బాధ్యతలు responsibilities కూడా ఇవ్వలేదు.

అమాత్యుడిగా ప్రమాణ స్వీకారం చేశానని సంబర పడాలో, బాధ్యతలు ఇవ్వలేదని నిరాశ పడాలో తెలియని డోలాయమాన పరిస్థితిలో ఆ మంత్రి ఉన్నారు.

ఆయన ఎవరో కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత Congress senior leader, మాజీ క్రికెటర్ cricketer అజారుద్దీన్. జూబ్లీహిల్స్ ఎన్నికల ముంగిట ఆ పార్టీ హడావుడిగా ఆయనను మంత్రిని చేసింది.

ఇటీవల Jubilee Hills elections కు ముందు ప్రమాణ స్వీకారం చేసిన అజార్​కు ఏ బాధ్యతలు అప్పగించలేదు. ఇప్పుడీ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్​గా మారింది.

Minister Azharuddin | ఇచ్చినట్లే ఇచ్చి..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ నగరానికి చెందిన మైనార్టీ నాయకుడు అజారుద్దీన్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఎంపీగా ఒకసారి పని చేశారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజార్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో ఓటమి మూటగట్టుకున్నారు. అయితే, ఆయన హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ నేపథ్యంలో అజారుద్దీన్​ను మరోసారి జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పోటీలో దింపుతుందని అంతా భావించారు. కానీ, ప్రభుత్వం అనూహ్యంగా ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది.

గవర్నర్ Governor కోటా ఎమ్మెల్సీల MLC నియామక ప్రక్రియ కోర్టు తుది ఆదేశాలకు లోబడి ఉన్న తరుణంలో అజార్​కు ఎమ్మెల్సీ యోగం వస్తుందా.. రాదా? అన్నది సందిగ్ధత ఏర్పడింది.

అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి దూకుడుగా వ్యవహరించి అజారుద్దీన్​ను మంత్రివర్గంలోకి తీసుకుంది. రెండు రోజుల క్రితం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

Minister Azharuddin | పోర్టిఫోలియో లేని అజార్..

అయితే, రోజులు గడుస్తున్నా ఆయనకు పోర్టిఫోలియో కేటాయించలేదు. ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. ప్రమాణ స్వీకారం చేసిన సంతోషంలో ఉన్న అజారుద్దీన్​కు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది.

ప్రమాణ స్వీకారం చేసిన రోజే మంత్రులకు శాఖలు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, రేవంత్ సర్కారు మాత్రం ఈసారి అందుకు విరుద్ధంగా అజారుద్దీన్​కు శాఖలు కేటాయించకుండా జాప్యం చేస్తోంది.

ఇప్పుడిదే రాష్ట్రంలో హాట్ టాపిక్​గా మారింది. శాఖల కేటాయింపు విషయంలో సందిగ్ధం కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

తనకు ఫలానా శాఖ కావాలని కొత్త మంత్రి పట్టుబడుతుండగా.. అందుకు సీఎం నిరాకరించడం వల్లే పోర్టిఫోలియో కేటాయింపుపై పీఠముడి పడిందన్న ప్రచారం జరుగుతోంది.