HomeతెలంగాణTiger Conservation | జీవో నంబర్​ 49పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఆదివాసీల హర్షం

Tiger Conservation | జీవో నంబర్​ 49పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఆదివాసీల హర్షం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tiger Conservation | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొమురం భీమ్​ కన్జర్వేషన్​ కారిడార్​ (Komuram Bheem Conservation Corridor) ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నంబర్​ 49 (G.O. 49)ను నిలిపివేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోపై ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దానిని నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

Tiger Conservation | అసలు ఏమిటీ ఈ జీవో

తెలంగాణ ప్రభుత్వం ఆసిఫాబాద్‌ జిల్లాలో టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌ ఏర్పాటు కోసం జీవో 49 తీసుకొచ్చింది. టైగర్​ కన్జర్వేషన్ (Tiger Conservation)​ కోసం పలు గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ జీవోతో ఆదివాసీ గ్రామాలు కనుమరుగవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

Tiger Conservation | ఆందోళనలు చేపట్టిన ఆదివాసీలు

జీవో 49తో వందలాది గ్రామాలను ఖాళీ చేయించనున్నారని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. జులై 21 (సోమవారం) ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా బంద్​ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదివాసీల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని జీవోను నిలిపివేయాలని నిర్ణయించింది.

Tiger Conservation | మావోయిస్టుల పేరిట లేఖ

జీవో 49కు వ్యతిరేకంగా గతంలో మావోయిస్టుల పేరిట లేఖ కూడా విడుదలైంది. ఈ జీవోతో ఆసిఫాబాద్​ జిల్లాలోని 339 గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. మే 5న తీసుకొచ్చిన ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్​ చేశారు. కాగా.. తాజాగా ప్రభుత్వం జీవోను నిలిపివేయాలని నిర్ణయించడంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tiger Conservation | సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క

జీవో నంబర్​ 49ను ప్రభుత్వం రద్దు చేయడంతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి సీతక్క (Minister Seehtakka), ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కలిశారు. జీవోను వెనక్కి తీసుకోవడంపై వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు.