అక్షరటుడే, ఆర్మూర్: Alur | కాంగ్రెస్ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ (Armoor Constituency) కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డి (Podduturi Vinay reddy) ఆదేశాల మేరకు ఎస్సీ సబ్‌ప్లాన్ (SC Subplan) నిధులు రూ.40 లక్షలతో డ్రెయినేజీ పనులు, సీసీ రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామంలో మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆలూర్ గ్రామంలో దశలవారీగా రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థతో పాటు ఇతర పనులు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ మెంబెర్స్ చిరంజీవి, భాస్కర్, సంజీవ్, వీడీసీ అధ్యక్షులు మగ్గిడి సూర్య, నారాయణ, విజయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారాయణ, ఉదయ్, నవనీత్, ముత్యం రెడ్డి, చంటి, నీలగిరి శ్రీనివాస్,శివ, మహేష్, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.
