ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​ZPHS Borgaon | నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

    ZPHS Borgaon | నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: ZPHS Borgaon | నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా బోర్గాం(పి) జిల్లా పరిషత్​ పాఠశాల (Borgaon (P) Zilla Parishad School) ఉపాధ్యాయ బృందం కృషి చేస్తోందని పాఠశాల హెచ్​ఎం శంకర్​ అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది స్కూల్​ ప్రారంభం కాకముందే 240 మంది విద్యార్థులు స్కూల్​లో అడ్మిషన్ల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. పాఠశాల ప్రారంభమైన నెలరోజుల్లోనే అడ్మిషన్లు ముగుస్తాయని పేర్కొన్నారు.

    గతేడాది తమ పాఠశాలలో 920 మంది విద్యార్థులు విద్యనభ్యసించారన్నారు. అలాగే 194 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పాసయ్యారని వివరించారు. పాఠశాలలో సకల సౌకర్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. పాఠశాలలో గ్రామ పెద్దలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు...

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి మృతి

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన...

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...