ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Seethakka | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

    Minister Seethakka | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (State Panchayat Raj Minister Seethakka) అన్నారు. జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి మహిళలకు మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ బంకులు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

    Minister Seethakka | మహిళా సంఘాలకే బాధ్యతలు..

    ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల (government school students) స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించడం ద్వారా స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థలకు అవసరమైన యూనిఫాంలను కుట్టే పనులను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) బడ్జెట్​లో స్త్రీ, శిశు సంక్షేమానికి 2862 కోట్లు కేటాయించి మహిళలకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు.

    Minister Seethakka | అధికమొత్తంలో మహిళలకు రుణాలు..

    మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పలు పథకాలను సర్కారు ప్రతిపాదించిందని, గ్రామీణ మహిళాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి పథకం (Indira Mahila Shakti scheme) మహిళకు ఒక వరం లాంటిదన్నారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్యకు బ్యాంకు లింకేజీ రుణం రూ. 20.56 కోట్ల చెక్కును అందజేశారు.

    అలాగే కామారెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.5.28 కోట్ల వడ్డీ రాయితీ, చెక్కు, లోన్ బీమా కింద 22 లక్షల రూపాయల చెక్కు, ప్రమాద బీమా కింద ముగ్గురు సభ్యుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ. 30 లక్షలు చెక్కును అందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali), కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), అదనపు కలెక్టర్ చందర్ నాయక్, సెర్ఫ్ సీఈవో నగేష్, డీఆర్డీవో సురేందర్, కామారెడ్డి ఆర్డీవో వీణ, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...