అక్షరటుడే, నిజాంసాగర్: Jukkal MLA | మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు (MLA Lakshmi Kantharao) అన్నారు. నిజాంసాగర్ మండలం (Nizamsagar mandal) పెద్ద ఆరేపల్లి వద్ద రిజర్వాయర్‌లో వందశాతం సబ్సిడీపై పంపిణీ చేసిన చేపపిల్లలను వదిలారు.
Jukkal MLA | ఉపాధి అవకాశాలు
ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులను చేపల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మత్స్యకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేపల పెంపకం యూనిట్లను ఏర్పాటు చేసి, నియంత్రిత వాతావరణంలో చేపలను పెంచి వాణిజ్య అవసరాల కోసం ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో మొత్తం 48.18 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, స్థానిక నాయకులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.