అక్షరటుడే, వెబ్‌డెస్క్: The Girlfriend success meet | ‘ది గర్ల్ ఫ్రెండ్’ The Girlfriend సినిమా బాక్సాఫీసు వద్ద విజయ పతాకం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో చిత్రం యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసి, సంబరాలు చేసుకున్నారు.
కాగా, హీరోయిన్ రష్మిక మందానకు హీరో విజయ్ దేవరకొండ Vijay Deverakonda ముద్దు పెట్టారు. సక్సెస్ మీట్‌కు హాజరైన విజయ్.. రష్మిక చేతిపై కిస్ ఇచ్చి తన ప్రేమను కళ్లల్లో చూపారు. విజయ్ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రష్మిక ప్రకటించిన విషయం తెలిసిందే..
The Girlfriend success meet | ఎమోషనల్..
ఇక ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం సక్సెస్ మీట్ జరుగుతున్న సమయంలో రష్మిక ఎమోషనల్ అయ్యారు. చిత్రంలోని సాంగ్ లైవ్ ఫెర్ఫార్మ్ చేస్తున్న సమయంలో రష్మిక తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఆమె heroine Rashmika Mandanna ముఖం ఎరుపెక్కింది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఉబికి వస్తున్న కన్నీటిని ఆమె బలవంతంగా ఆపేసుకున్నారు.
రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం ఈ నెల 7న థియేటర్లలో విడుదలైన సంగతి విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
