అక్షరటుడే, వెబ్‌డెస్క్: The Girlfriend Movie | నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకులని మెప్పించిన రాహుల్ రవీంద్రన్ Rahul Ravindran దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’.
ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్న National Crush Rashmika Mandanna, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి talented hero Dixit Shetty జంటగా నటించారు. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో “ది గర్ల్ ఫ్రెండ్” ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహించారు.
The Girlfriend Movie | ఐదు రోజుల్లో రూ. 20 కోట్లు..
ప్రస్తుతం “ది గర్ల్ ఫ్రెండ్” బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గత ఐదు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.20.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా, “ది గర్ల్ ఫ్రెండ్” మూవీని చూసిన ఓ యువతి చున్నీ తీసిపారేయడం హాట్ టాపిక్‌గా మారింది. చిత్రం క్లైమాక్స్ అయిపోయాక డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్తో సదరు అమ్మాయి మాట్లాడింది.
‘క్లైమాక్స్ చూశాక దీనిని తొలగించాలని అనిపిస్తోందీ’ అంటూ ఆ అమ్మాయి చున్నీ తీసేసింది. ఈ క్రమంలో దర్శకుడు రాహుల్ director Rahul చప్పట్లు కొట్టి ఆమెను కౌగిలించుకున్నారు.
కాగా, ఆమె చేసిన పనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అమ్మాయిలు స్వతంత్రంగా ఉండటం మంచిదే.. అయితే, మహిళా సాధికారత అంటే చున్నీ తొలగించుకోవడమా..? అని ప్రశ్నిస్తున్నారు.
