అక్షరటుడే ఇందూరు: Nizamabad Municipal Corporation | నగరంలో చెత్త సేకరణ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త పారేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం పర్యటించి క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.
Nizamabad Municipal Corporation | విరివిగా ప్రచారం చేయాలి..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్లపై చెత్త పారవేస్తే జరిమానాలు విధించబడుతుందనే విషయాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు, మైకుల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు (awareness programs) ఏర్పాటు చేయాలని సూచించారు. మురికి కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తూ ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాలను శుభ్రం చేయించి పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటాలన్నారు.
Nizamabad Municipal Corporation | డంపింగ్యార్డు పరిశీలన
నగర శివారులోని నాగారం డంపింగ్ యార్డును (Nagaram dumping yard) కలెక్టర్ సందర్శించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరుచేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని.. తద్వారా బయోమైనింగ్ సులభం అవుతుందన్నారు. వ్యర్థాలను శుద్ధి చేస్తూ కంపోస్టు తయారు కోసం ప్రతిపాదించిన మరో రెండు వేస్టేజ్ ప్రాసెసింగ్ యంత్రాలను సత్వరమే తెప్పించాలని కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఇన్ఛార్జి ఎస్హెచ్వో సాజిద్ తదితరులు ఉన్నారు.