Homeజిల్లాలునిజామాబాద్​Birkur | మహిళా సాధికారతకు పునాది.. ఉజ్వల యోజన..

Birkur | మహిళా సాధికారతకు పునాది.. ఉజ్వల యోజన..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల యోజన మహిళలకు ఎంతో ఉపయోగకరమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. బీర్కూర్​లో పలువురు మహిళలకు గ్యాస్​ కనెక్షన్లు అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, బీర్కూర్: Birkur | కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana) మహిళా సాధికారతకు పునాది రాయిలా నిలుస్తుందని బీజేపీ నాయకులు (BJP Leaders) పేర్కొన్నారు. పథకం మూడో విడతలో భాగంగా మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సాయికిరణ్ మాట్లాడుతూ.. దేశంలోని మహిళల ఆరోగ్యం రక్షించేందుకు, పొగ రహిత వంట గదులను అందించేందుకు ప్రధాని మోదీ (Prime Minister Modi) ఉజ్వల యోజన రూపంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10.33 కోట్ల మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించడం కేంద్ర ప్రభుత్వ మహిళా సంక్షేమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు రాధాకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు రాము, వడ్ల బస్వరాజ్, నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు హన్మాండ్లు, పండరి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News