అక్షరటుడే, దోమకొండ : Domakonda | మండల కేంద్రంలోని గడీకోటలో జార్ఖండ్ మాజీ సీఎం, జాతీయ అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ ముండాను కామారెడ్డి జిల్లా (Kamareddy District) అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు తీగల తిర్మల్‌గౌడ్ ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో అర్చరీ జాతీయ పోటీలు ముగియగా జాతీయ అర్చరీ డైరెక్టర్ ప్రీమిలేయర్ కామినేని అనిల్‌కుమార్ ఆహ్వానం మేరకు అర్జున్ ముండా, తదితర సంఘం సభ్యులు దోమకొండ గడీకోట (Gadikota)కు విచ్చేశారు. కోటలోనే గురువారం రాత్రి బస చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం వారిని కలుసుకున్న మాజీ జడ్పీటీసీ, జిల్లా అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు తీగల తిర్మల్ గౌడ్ ఘనంగా సన్మానించారు. మాజీ సీఎం అర్జున్ ముండా (Former CM Arjun Munda) దంపతులతో పాటు జాతీయ అర్చరీ డైరెక్టర్ ప్రీమిలేయర్ కామినేని అనిల్ కుమార్, జాతీయ అర్చరీ కమిటీ ఉపాధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి, గురుం, కోశాధికారి జోరిస్ పాల్, సుమంత్ మహతి, అరవింద్, ఒలింపిక్ ఛాంపియన్ ప్లేయర్ డోలా బెనర్జీలతో పాటు పలువురు ఉన్నారు. కార్యక్రమంలో దోమకొండ అర్చరీ అకాడమీ కోచర్ ప్రతాప్ దాస్, గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జి, స్థానిక నాయకులు కుమ్మరి రాజు, నయీం తదితరులు పాల్గొన్నారు.