అక్షరటుడే ఇందూరు:MLA Dhanpal Suryanarayana | రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. అకాల వర్షాలతో నగరంలోని శ్రద్ధానంద్ గంజ్(Shradhanand Ganj)లో తడిసిన ధాన్యాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే(MLA) మాట్లాడుతూ.. వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు(Farmers) పండించిన ప్రతిగింజ కొనుగోలు చేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు 40 శాతం కూడా సేకరించలేదని మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు, హమాలీ, లారీల కొరత కారణంగా రైతన్నలు మండుటెండల్లో రోజుల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రకటించిన రూ.500 బోనస్ అంత బోగస్సేనన్నారు. ఆయన వెంట గంజ్ ఇన్ఛార్జి శకుంతల, కార్పొరేటర్లు, మండలాధ్యక్షులు, కార్యకర్తలు తదితరులున్నారు.