అక్షరటుడే, వెబ్డెస్క్: Republic Day | గణతంత్ర వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari)కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన జెండా ఎగుర వేస్తుండగా కర్ర విరిగి కింద పడింది.దేశవ్యాప్తంగా సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జెండా ఎగుర వేశారు.
ఇందులో భాగంగా మక్తల్ తహశీల్దార్ కార్యాలయం (Makthal Tahsildar Office)లో గణతంత్ర వేడుకలకు మంత్రి హాజరయ్యారు. జెండాను కార్యాలయంపైన ఏర్పాటు చేశారు. మంత్రి కింద నుంచి జెండా ఆవిష్కరించేందుకు సిద్ధం అయ్యారు. దీనికోసం జెండాకు కట్టిన తాడు లాగగా.. ఒక్కసారిగా జెండా కర్ర విరిగిపోయింది.
జెండా కర్ర విరిగి కార్యాలయంపై నుంచి కింద పడింది. అయితే మంత్రి పక్కకు తప్పుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. వాకిటి శ్రీహరి సమీపంలోనే కర్ర పడింది. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. అధికారులు అతడిని ఆస్పత్రికి తరలించారు.