Jenda Balaji
Jenda Balaji | ప్రారంభమైన జెండా బాలాజీ ఉత్సవాలు

అక్షరటుడే, ఆర్మూర్‌ : Jenda Balaji | పట్టణంలోని జెండాగల్లీ వేంకటేశ్వర ఆలయ (Venkateswara Temple) ఆవరణలో సర్వసమాజ్‌ ఆధ్వర్యంలో ఏటా శ్రావణ మాసంలో జెండా బాలాజీ జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈసారి సైతం వేడుకలు నిర్వహించారు. ఆదివారం ఆలయం చుట్టూ జెండాతో ప్రదక్షిణలు చేసి జెండా(బట్ట)కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెండాను ప్రతిష్ఠించారు.

అంతకు ముందు జెండాను వేంకటేశ్వర ఆలయం నుంచి గోల్‌బంగ్లా మీదుగా జంబిహనుమాన్‌ ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. 9 రోజుల పాటు ఆలయంలో జెండాకు పూజలు నిర్వహించి ఆగస్టు 5న జెండా జాతర నిర్వహించనున్నారు. అనంతరం ఊరేగింపుగా తీసుకు వెళ్లి అంకాపూర్‌ గ్రామస్థులకు అప్పగిస్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్‌రెడ్డి జంబి హనుమాన్‌ ఆలయ ఆవరణలో జెండాకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కొట్టాల సుమన్, ప్రధాన కార్యదర్శి కర్తన్‌ దినేష్, సర్వసమాజ్‌ సభ్యులు పాల్గొన్నారు.