656
అక్షరటుడే, హైదరాబాద్: first phase panchayat elections : రాష్ట్రంలో గురువారం తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
first phase panchayat elections : రికార్డు స్థాయిలో..
రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లో 45,15,141 మంది ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మెదక్ జిల్లాలో మొదటి విడతలో 160 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. కాగా, ఇప్పటివరకు (ఏకగ్రీవాలతో సహా) 113 గ్రామాల్లో ఫలితాలు వెలువడ్డాయి.