అక్షరటుడే, వెబ్‌డెస్క్:Maruti Suzuki | దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా మారుతి సుజుకీ(Maruti Suzuki) అడుగులు వేస్తోంది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును 500 కిలోమీటర్ల రేంజ్‌తో ఇ-విటారా(e-VITARA ) పేరుతో మరో రెండు నెలల్లో లాంచ్ చేసే అవకాశాలున్నాయి.
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ వాహన(Electric vehicle) విభాగంలోకి అడుగుపెడుతోంది. భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని 500 కిలోమీటర్ల రేంజ్‌తో తక్కువ ధరలో దీనిని తీసుకురానున్నారు. ధర రూ. 17 లక్షలనుంచి రూ. 22.5 లక్షల మధ్య ఉండే అవకాశాలున్నాయి. ఈ మోడల్ ఇదే ఫీచర్లతో ఉన్న టాటా కర్వ్ ఈవీ(Tata CURVV EV), ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ, బీవైడీ అట్టో 3 మోడళ్లకన్నా తక్కువ ధర కావడంతో దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో గేమ్ చేంజర్(Game changer)గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇ-విటారా స్పెసిఫికేషన్స్(Specifications) ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి.
బ్యాటరీ సామర్థ్యం:ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లలో లభించనుంది. 49 కేడబ్ల్యూహెచ్(kWh) వేరియంట్ 144 పీఎస్ ఎలక్ట్రిక్ మోటార్‌తో, 61 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 174 పీఎస్ ఇ-మోటార్‌తో పెయిర్ అయి ఉంటాయి. రెండు మోటార్లు 192 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
ఇ-విటారా సింగిల్ చార్జ్‌తో 500 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.
నాలుగు మోడ్‌లు:ఎకో మోడ్(Eco mode) : రేంజ్‌ను పెంచడానికి శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
సాధారణ మోడ్ : రోజువారీ ఉపయోగం కోసం సమతుల్య డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
స్పోర్ట్ మోడ్ : పూర్తి థొరెటల్ ప్రతిస్పందనతో మెరుగైన పనితీరును అందిస్తుంది.
స్నో మోడ్ : జారే ఉపరితలాలపై డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిరది.
మూడు వేరియంట్లు:ఇ-విటారా మూడు విభిన్న వేరియంట్ల(Variants)లో లభిస్తుంది. ఇవి డెల్టా, జీటా, ఆల్ఫా.
డిజైన్, ఫీచర్లు:ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు.
ఎరోడైనమిక్‌గా ఆప్టిమైజ్ చేయబడిన క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్.
స్టైలిష్ అల్లాయ్ వీల్స్(Stylish alloy wheels).
అధిక నాణ్యత అనుభూతి కోసం డ్యూయల్ టోన్ నలుపు, టాన్ బ్రౌన్ థీమ్.
ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.
మౌంటెడ్ కంట్రోల్‌లతో టూస్పోక్ స్టీరింగ్ వీల్.
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్.
360 డిగ్రీల కెమెరా.
అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలు.
ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్.
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు.
ఇండియా స్పెక్ మోడల్ ప్రారంభంలో ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా డ్యుయల్ మోటర్ ఆల్‌వీల్ డ్రైవ్ ఎంపికను పొందుతాయి.
లాంచ్ టైమ్‌లైన్:అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇ-విటారాను ఈ ఏడాది సెప్టెంబర్(September)లో లాంచ్ చేసే అవకాశాలున్నాయి.