అక్షరటుడే, వెబ్డెస్క్ : Nampally fire accident | నాంపల్లి (Nampally )లో బచ్చాస్ ఫర్నిచర్ గోదాంలో మంటలు అదుపులోకి రావడం లేదు. అగ్ని మాపక సిబ్బంది, సహాయక బృందాలు ఆరు గంటలకు పైగా శ్రమిస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాంపల్లి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసింది. చీరక్గల్లి (Chirakgalli) లైన్లో గల బచ్చాస్ ఫర్నీచర్ షాపులో మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రమాదం జరగ్గా.. భవనంలో ఆరుగురు చిక్కుకున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో అదుపులోకి తీసుకు రావడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో ఆరు గంటలు రెస్క్యూ ఆపరేషన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే భవనంలో పొగ కమ్ముకొని ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది అవుతోంది.
Nampally fire accident | ఆరుగురి కోసం..
భవనంలో ఆరుగురు చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి అధికారులు శ్రమిస్తున్నారు. అయితే వారి ఆచూకీ ఇంత వరకు లభించలేదు. వాచ్మెన్ కుమారులు అఖిల్ (7), ప్రణీత్ (11) మంటల్లో చిక్కుకున్నారు. లోపల చిక్కుకున్న ఆరుగురి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మెడికల్ ఎమర్జెన్సీ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటికే పైపులతో ఆక్సిజన్ని అధికారులు లోపలికి పంపుతున్నారు. దట్టమైన పొగ కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కి అంతరాయం కలుగుతోంది. నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar), కలెక్టర్ హరిచందన ఘటన స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Nampally fire accident | అక్రమంగా వ్యాపారం..
నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 66 ఏళ్ల క్రితం నాటి పాత భవనంలో అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 1960లో హిందీ ప్రచార సభ (Hindi prachara sabha) పేరుతొ భవన నిర్మాణం చేపట్టారు. కొందరు దాతలు ఇచ్చిన విరాళాలతో భవనం నిర్మించారు. అయితే కొంత కాలంగా ఆ భవనం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి షాప్స్ ఏర్పాటు షాప్స్ చేశారు. ఖాళీ చేయాలని గతంలోనే హైకోర్టు (High Court) ఆదేశించినా.. పట్టించుకోకుడా వ్యాపార దందా సాగిస్తున్నారు.