ePaper
More
    Homeఅంతర్జాతీయంfighter jet J-35A | పాకిస్తాన్‌కు అండగా చైనా.. వేగంగా స్టెల్త్ ఫైట‌ర్ జెట్ జే-35ఏ...

    fighter jet J-35A | పాకిస్తాన్‌కు అండగా చైనా.. వేగంగా స్టెల్త్ ఫైట‌ర్ జెట్ జే-35ఏ డెలివ‌రీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: fighter jet J-35A | ఇండియా, పాకిస్తాన్ (india-pakistan) మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగుతున్న త‌రుణంలో చైనా (china) వ‌క్ర‌బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తోంది. మ‌న శత్రువుకు అన్ని విధాలుగా అండ‌గా నిలుస్తోంది. పేషావ‌ర్‌లో ప్రాజెక్టు (peshawer project) నిర్మాణాన్ని వేగ‌వంతం చేసిన చైనా.. తాజాగా పాక్‌ సైనిక శ‌క్తిని బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది. చైనా తన అధునాతన ఫిఫ్త్ జ‌న‌రేష‌న్ అయిన స్టెల్త్ ఫైటర్ జెట్‌లు – J-35Aల‌ను ఇస్లామాబాద్‌కు (islamabad) డెలివరీ చేసే ప్ర‌క్రియ‌ను వేగవంతం చేసింది. భార‌త్‌తో పాక్ (india-pak) ఘ‌ర్ష‌ణ ప‌డినందుకు ఇది “ప్రతిఫలం” అని దౌత్య వర్గాలను ఉటంకిస్తూ న్యూస్ 18 ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, దక్షిణాసియాలో (South Asia) ప‌ట్టు పెంచుకునేందుకు బీజింగ్ వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. అందులో భాగంగానే చైనా-పాకిస్తాన్ (china – pakistan) రక్షణ సహకారం వేగవంతం కావడాన్ని ఎత్తిచూపింది. రానున్న ఆగస్టు నాటికి పాకిస్తాన్ 30 J-35A జెట్‌ల మొదటి బ్యాచ్‌ను అందుకుంటుందని అంచనా వేస్తున్న‌ట్లు దౌత్య వర్గాలు తెలిపాయి.

    fighter jet J-35A | షెడ్యూల్ కంటే ముందే..

    వాస్త‌వానికి పాకిస్తాన్‌కు పాత షెడ్యూల్ ప్రకారం ఇప్ప‌ట్లో స్టెల్త్ ఫైట‌ర్ జెట్లు (stealth fighter jets) అంద‌కూడ‌దు. కానీ, ప్ర‌స్తుత భౌగోళిక‌, సైనిక ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో గతంలో పెట్టుకున్న షెడ్యూల్ కంటే ముందే ఫైట‌ర్ జెట్లు అందించేందుకు చైనా య‌త్నిస్తోంది. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (efense Minister Khawaja Asif) , చైనా సైనిక (Chinese military), రాజకీయ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా స్టెల్త్ ఫైట‌ర్ జెట్లతో పాటు లాజిస్టిక్స్, ఫైనాన్సింగ్ స‌హ‌కారంపై ఒప్పందాల‌ను ఖరారు చేసుకున్న‌ట్లు తెలిసింది. చైనా ఫైటర్ జెట్లపై 50% తగ్గింపుకు అంగీకరించిందని, దానికి తోడు, నిధుల చెల్లింపుల్లోనూ ప‌ట్టువిడుపులు ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు సంబంధిత వర్గాలు ధృవీకరిస్తున్నాయి. గత సంవత్సరం చివర్​లో పాకిస్తాన్ చైనా నుంచి 40 J-35A ఫైటర్ జెట్‌లను (J-35A fighter jets)కొనుగోలు చేయాలని నిర్ణ‌యించింది. పాక్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ల (Pakistan Air Force pilots) బృందం ఇప్పటికే బీజింగ్‌లోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో J-35A ఫైట‌ర్ జెట్లను న‌డ‌ప‌డంలో శిక్ష‌ణ పొందిన‌ట్లు తెలిసింది.

    fighter jet J-35A | డ్రాగ‌న్ కుయుక్తులు..

    ఇండియా, పాక్ కాల్పుల విర‌మ‌ణ(ceasefire) త‌ర్వాత డ్రాగ‌న్ పాకిస్తాన్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతోంది. భార‌త సైనిక (India military) శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను గుర్తించిన చైనా.. ఆసియాలో త‌న‌కు ఎప్ప‌టికైనా ఇండియా నుంచి పోటీ త‌ప్ప‌ద‌నే భావ‌న‌లో ఉంది. అందుకే మ‌న శ‌త్రువుల‌ను బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించింది. భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ (india – pakistan ceasefire) ప్రకటన తర్వాత చైనా, పాకిస్తాన్ అధికారులు, మంత్రుల మధ్య అనేక ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. ఇందులో భారత వైమానిక శక్తి ఆధునీకరణతో సహా సంక్లిష్టమైన ప్రాంతీయ భద్రతా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఫైటర్ జెట్ (fighter jets) ఒప్పందంతో పాటు చైనా అధికారులు పాకిస్తాన్ పౌర, సైనిక మౌలిక సదుపాయాలను బ‌లోపేతం చేసేందుకు $25 బిలియన్లను పెట్టుబడి (25billoin investment) పెట్టడానికి సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...