అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి సీఐ రవీంద్ర నాయక్ (Yella Reddy CI Ravindra Nayak) అన్నారు. బక్రీద్ (Bakrid) నేపథ్యంలో ఎల్లారెడ్డిలో గురువారం రాత్రి “ఫుట్ పెట్రోలింగ్” (Foot patrol) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగను సామరస్యంగా జరుపుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై మహేష్, సిబ్బంది పాల్గొన్నారు
