Homeజిల్లాలుకామారెడ్డిASP Chaitanya Reddy | పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

ASP Chaitanya Reddy | పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Sub-Division ASP Chaitanya Reddy | బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. గురువారం రాత్రి దేవునిపల్లి, మాచారెడ్డి(machareddy), రామారెడ్డి(Ramareddy), భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, రాజంపేట, కామారెడ్డి పట్టణ పోలీస్​స్టేషన్(Kamareddy Town Police Station)​ పరిధిలోని ప్రజలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి పోలీస్​శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి ఏదైనా సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని.. స్వచ్ఛందంగా వాహనాలు ఆపడం కరెక్ట్​ కాదన్నారు. కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.