అక్షరటుడే, ఆర్మూర్: హైదరాబాద్‌లోని (Hyderabad) ఇందిరాపార్క్‌లో (Indira park) ఈనెల 8న నిర్వహించనున్న రైతుధర్నాను(Raithu Dharna) జయప్రదం చేయాలని అఖిల భారత రైతు ఐక్య సంఘం (All India Farmers’ United Association) నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తహశీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా అధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి గంగన్న మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతోందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటామని చెప్పి, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తోందన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాకు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు లింబాద్రి, బట్టు రవి, తదితరులు పాల్గొన్నారు.