Kamareddy | తూకాలు వేయట్లేదని రోడ్డెక్కిన రైతన్న
Kamareddy | తూకాలు వేయట్లేదని రోడ్డెక్కిన రైతన్న

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | నెల రోజులు గడిచినా ధాన్యం తూకాలు వేయడం లేదని ఆరోపిస్తూ రైతులు(Farmers) రోడ్డెక్కాడు. ఈ మేరకు మాచారెడ్డి మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజులుగా తూకాలు(Weighing) వేయకపోవడం సరికాదన్నారు. అకాల వర్షాల కారణంగా నిల్వ ఉన్న ధాన్యం తడిసి రైతులకు నష్టం జరగకముందే ప్రభుత్వం(Government) వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. అధికారులకు ఎన్నిసారు ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు వచ్చి తూకాలు జరిగేలా చూస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.