ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాల్సిందే.. వర్షంలో ఆందోళన

    Bodhan | మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాల్సిందే.. వర్షంలో ఆందోళన

    Published on

    అక్షరటుడే, బోధన్: Bodhan | జీపీ తరపున విధులు నిర్వహిస్తూ సిద్ధాపూర్​లో (Siddhapur) ట్రాక్టర్​ బోల్తా పడి మృతి చెందిన ఇద్దరికి పరిహారం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్​ చేశారు. బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రిలోని (Bodhan Government Hospital) పోస్టుమార్టం గది ఎదుట వారు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు.

    ఈ సందర్భంగా మృతుల బంధువులు,కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ.. జీపీ తరపున పనిచేస్తూ వారు అకాల మరణం చెందినందున ఒక్కొక్కరికి రూ. 50లక్షల చొప్పున పరిహారం అందించాలని వారు డిమాండ్​ చేశారు. వర్షంలోనూ వారు ధర్నా కొనసాగించారు.

    సమాచారం అందుకున్న బోధన్​ తహశీల్దార్​ విఠల్ ​(Bodhan Tahsildar Vitthal), బోధన్​ రూరల్​ సీఐ విజయ్​బాబు (Bodhan Rural CI Vijay Babu) బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

    More like this

    Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలి

    అక్షరటుడే, ఇందూరు: Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలని డీఈవో అశోక్ (DEO Ashok) తెలిపారు....

    Minister Seethakka | భారీ వర్షాల కారణంగా కామారెడ్డి బీసీ సభ వాయిదా

    అక్షరటుడే, కామారెడ్డి : Minister Seethakka | పట్టణంలో ఈనెల 15న నిర్వహించాలనుకున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ...

    Nepal | నేపాల్ లో భారత టూరిస్టులపై దాడి.. ఆలస్యంగా వెలుగులోకి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకి పోయిన నేపాల్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అయితే, ఇటీవల...