అక్షరటుడే, ఎల్లారెడ్డి: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు.. 25 ఏళ్లుగా అంబలి వితరణ కేంద్రాల (Ambali distribution centers) నిర్వహణ అభినందనీయమని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు (Mla Madan mohan Rao) అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి (Yellareddy) మండల కేంద్రంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ (Former Municipal Chairman) కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి వితరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 25 ఏళ్లుగా అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు పంపిణీ చేయడంపై ప్రశంసించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ (Market Committee Chairperson) రజిత వెంకట్రాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సామెల్, శ్రీనివాస్ రెడ్డి, సాయిబాబా, అరుణ, వాసవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
