అక్షరటుడే, ఆర్మూర్ : CPIML New Democracy | శ్రామిక రాజ్యస్థాపన కోసం పనిచేయడమే అమరవీరులకు నిజమైన నివాళి అని సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా (Nizamabad District) సహాయ కార్యదర్శి దాసు అన్నారు. నందిపేట్ మండలకేంద్రంలో న్యూడెమోక్రసీ (New Democracy) నందిపేట్ సబ్ డివిజన్ కార్యదర్శి అబ్దుల్ అధ్యక్షతన గురువారం అమరవీరుల స్మారక సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం తమ ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగ స్ఫూర్తితో కార్మిక, రైతు, ప్రజా పోరాటాలను ఉధృతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం (Central Government) కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు తీవ్రంగా నష్టం చేస్తోందన్నారు. సీఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను వేతనాలను పెంచి వెంటనేప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ (AIKMS) ఆర్మూర్ డివిజన్ కమిటీ నాయకుడు దేవన్న, ప్రజాసంఘాల నాయకులు షాపూర్ పోశెట్టి, లింగన్న, ముత్యం, అంజన్న, ఐలయ్య, పీవైఎల్ సాగర్, అరుణోదయ కళాకారులు నారాయణ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.