HomeUncategorizedVice President Dhankhar | ప్ర‌వేశిక‌ను మార్చ‌లేము కానీ.. 1976లోనే మార్చార‌ని గుర్తు చేసిన ధ‌న్‌ఖ‌డ్‌

Vice President Dhankhar | ప్ర‌వేశిక‌ను మార్చ‌లేము కానీ.. 1976లోనే మార్చార‌ని గుర్తు చేసిన ధ‌న్‌ఖ‌డ్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vice President Dhankhar | రాజ్యాంగ ప్ర‌వేశిక మార్పుపై వివాదం నెల‌కొన్న త‌రుణంలో ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్(Vice President Dhankhar) శనివారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యాంగ ప్రవేశికను మార్చలేమని, కానీ దానిని 1976లోనే మార్చారని ఆయ‌న గుర్తు చేశారు. రాజ్యాంగ ప్ర‌వేశ మార్పున‌కు గురైన ఏకైక దేశం భార‌త్(India) మాత్ర‌మేన‌ని ఆయ‌న చెప్పారు. రాజ్యాంగ‌ ప్రవేశిక నుంచి “సోషలిస్ట్”, “లౌకిక” అనే పదాలను తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కోర‌డంతో ఈ వివాదం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్ఎస్ఎస్‌పై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టడంతో వివాదం మరింత ముదిరింది.

Vice President Dhankhar | ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలోనే మార్పు..

రాజ్యాంగం పెరిగే “విత్తనం” ప్రవేశిక అని ధ‌న్‌ఖ‌డ్ అన్నారు. 1976లో అత్యవసర పరిస్థితి సమయంలో అది మార్చబడిందని, దానికి సామ్య‌వాద‌, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చ‌బ‌డ్డాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలోనే “మనం ఆలోచించాలి,” అని ఉప రాష్ట్ర‌ప‌తి అన్నారు. బీఆర్ అంబేద్కర్(BR Ambedkar) రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు, ఆయన “క‌చ్చితంగా దానిపై దృష్టి పెట్టాలి” అని నొక్కి చెప్పారు. రాజ్యాంగ ప్రవేశిక మార్పుకు గురైన ఏకైక దేశం భారతదేశం అని చెప్పారు.

Vice President Dhankhar | ప్రవేశిక వివాదం ఏమిటి?

రాజ్యాంగ ప్రవేశికలో సామ్య‌వాద‌, లౌకిక అనే పదాలను చేర్చ‌డాన్ని ఆర్‌ఎస్‌ఎస్(RSS) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఇటీవ‌ల వ్యతిరేకించారు. ఈ పదాలను రాజ్యాంగంలో బలవంతంగా చేర్చారని, ప్రస్తుత కాలంలో వాటిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని హోసబాలే తెలిపారు. “ఇలాంటి పనులు చేసిన వారు నేడు రాజ్యాంగ కాపీతో తిరుగుతున్నారు. వారు ఇంకా క్షమాపణ చెప్పలేదు.. క్షమాపణ చెప్పండి” అని ఆయన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. బ‌ల‌వంతంగా చొప్పించిన వ్యాఖ్య‌ల‌ను తొలగించాలని ఆయ‌న కోర‌డం వివాదానికి దారితీసింది. బీజేపీ ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను సమర్థించగా, ఇది రాజ్యాంగ్యాన్ని, రాజ్యంగ నిర్మాత‌ల‌ను అవ‌మానించ‌డ‌మేని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.