Homeజిల్లాలుకామారెడ్డిKamareddy BJP | దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ చీకటి అధ్యాయం..

Kamareddy BJP | దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ చీకటి అధ్యాయం..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BJP | దేశ చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) అన్నారు. శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ విధించిన ఎమెర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోజుల్లో ప్రజలపై జరిగిన దుశ్చర్యలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్​లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) నియంతగా వ్యవహరించారన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ 21నెలల పాటు సాగిన నియంతృత్వ పాలనను ఎదురించిన వీరులందరికి జోహార్లు తెలిపారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.

Kamareddy BJP | ఉద్యమంలో పాల్గొన్న వీరులకు సన్మానం..

ఎమర్జెన్సీ కాలంలో ఉద్యమంలో పాల్గొన్న రంజిత్ మోహన్, రాజిరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు (BJP District President Neelam Chinna Raju), బీజేపీ గిరిజన మోర్ఛ రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, మాజీ జిల్లా అధ్యక్షుడు అరుణతార, బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైలా కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నాయకులు వేణు, రవీందర్, లింగారావు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News