HomeతెలంగాణAssembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..: ఏలేటి మహేశ్వర్​...

Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..: ఏలేటి మహేశ్వర్​ రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడడం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిందని బీజేపీ శాసనసభా పక్ష నేత (BJP Legislature Party Leader) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Yeleti Maheshwar Reddy) అన్నారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చీకటి రోజులు ఎమర్జెన్సీ (Emergency Period) అని దుయ్యబట్టారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాంగ్రెస్ కాలరాసిందన్నారు. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా కాంగ్రెస్ పాలన కొనసాగిందన్నారు. వీరి ఆలోచన ఎప్పుడు ఇరాన్, ఇటలీ చట్టాల మాదిరిగా ఉంటాయని విమర్శించారు.

Assembly Floor Leader | తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు..

తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ఢిల్లీలో తాకట్టు పెట్టాడని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) అపాయింట్​మెంట్​ కోసం ఢిల్లీకి వెళ్లడం.. రావడం తప్ప ఏ రోజు మాట్లాడలేదని అన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరకుండా ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే వీరు మరింత దిగజారేలా పాలన చేస్తున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని చెప్పారు.

Assembly Floor Leader | డబుల్​ ఇంజిన్​ సర్కారు కోసం..

ప్రజలు కూడా డబుల్ ఇంజిన్ సర్కారు (Double engine government) రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి బీజేపీ పని చేస్తుందని అన్నారు. బీజేపీ దేశానికి మొదటి ప్రాధాన్యతనిస్తుందని గుర్తు చేశారు. అలాగే ఈనెల 29న నిర్వహించే అమిత్​షా (Union Minister Amit Shah) సభకు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana), జిల్లా నాయకులు న్యాలం రాజు, పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News