అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | ప్రజల సహకారంతోనే ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) నిర్వహించుకున్నామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
CP Sai Chaitanya | షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి..
నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి డిసెంబర్ 17 వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలందరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
పోలీసుల పనితీరు భేష్..
పంచాయతీ ఎన్నికల సమయంలో విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న పోలీసుల పనితీరు భేష్ అని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. శాతి భద్రతల కోసం కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేని కృషి చేశారన్నారు. ప్రజలు, పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే ఈ ఎన్నికలు సజావుగా జరిగాయని ఆయన పేర్కొన్నారు.