అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Earth | భూమిపై రాత్రి – పగలు ఎలా ఏర్పడతాయో మనందరికీ తెలుసు. భూమి ఒకసారి తాను చుట్టూ తిరగడానికి సుమారు 24 గంటల సమయం తీసుకుంటుంది. అయితే భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పు వైపునకు తిరిగితే రాత్రి, పగలు ఏర్పడడం జరుగుతుంది. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు (Scientists) గమనించిన ఓ విశేషం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. అదేంటంటే భూమి తిరిగే వేగం క్రమంగా పెరుగుతోంది. భూమి తిరిగే వేగం పెరుగుతున్న నేపథ్యంలో, ఒక్కో రోజు గడిచే సమయం కొన్ని మిల్లీసెకన్ల మేరకు తగ్గుతోంది. కొన్ని సందర్భాల్లో ఇది 1.3 నుంచి 1.5 మిల్లీసెకన్లు తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Earth | అనేక మార్పులు..
ఉదాహరణకు, జూలై 9, జూలై 22 తేదీల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆగస్టు 5న కూడా ఇదే తరహా పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సాధారణ మనుషుల దైనందిన జీవితాల్లో పెద్దగా ఇబ్బంది పెట్టే అంశం కాదు. కానీ సాంకేతిక, శాస్త్రీయ వ్యవస్థలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచ సమయాన్ని నిర్ణయించే (Coordinated Universal Time) అటామిక్ క్లాక్స్ ఆధారంగా పనిచేస్తుంది. భూమి తిరిగే వేగంలో మార్పులు వస్తే, అటామిక్ టైమ్‌కి సోలార్ టైమ్‌కు మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. దాంతో నెగెటివ్ లీప్ సెకన్లు (Negative Leap Seconds) ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అంటే రోజులో ఒక సెకనును తీసేయాల్సి ఉంటుంది.
జీపీఎస్ GPS, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్స్ (Telecommunications Networks), బ్యాంకింగ్ లావాదేవీలు, విమానయాన, ఉపగ్రహ ప్రయోగాలు వంటి వ్యవస్థలు అత్యంత కచ్చితమైన టైమ్‌పై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో అనేక ఎర్రర్లు, సాఫ్ట్‌వేర్ ఫెయిల్యూర్లు తలెత్తే ప్రమాదం ఉంది. భూమి వేగం పెరగడానికి కారణాలు చూస్తే..
చంద్రుని ప్రభావం: చంద్రుడు భూమి భ్రమణంపై ప్రభావం చూపుతాడు. అతని స్థానం మారినప్పుడు భూమి వేగం తక్కువవడం లేదా పెరిగే అవకాశం ఉంటుంది.
మంచు కరుగుదల (గ్లోబల్ వార్మింగ్):
గ్లేషియర్లు కరిగి నీరు భూమధ్యరేఖ వైపు చేరడం వల్ల భూమి ద్రవ్యరాశి మారుతుంది. ఇది భూమి రోటేషన్‌ను ప్రభావితం చేస్తుంది.
అంతర్భాగ మార్పులు:
భూమి లోపల ఉండే ద్రవరూపం (Inner Core) మరియు ఘన పదార్థం (Outer Core) కదలికలు కూడా భూమి తిరిగే పద్ధతిపై ప్రభావం చూపుతాయి.
భూకంపాలు:
పెద్ద పెద్ద భూకంపాలు (Earthquakes) కూడా భూమి భ్రమణ వేగాన్ని తాత్కాలికంగా మార్చగలవు. ఉదాహరణకు, 2011 జపాన్ భూకంపం తర్వాత రోజు కొద్దిగా చిన్నదైందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ పరిణామాలు మన పర్యావరణానికి, సాంకేతిక వ్యవస్థలకు ఎంత సున్నితమైన సమన్వయం అవసరమో గుర్తుచేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి మార్పులకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.