అక్షరటుడే, కోటగిరి: Ration cards | ఎన్నో ఎళ్లుగా కొత్త రేషన్‌కార్డుల (Ration Cards) కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల సాకరమైందని పోతంగల్ (Pothangal) కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్ అన్నారు. పోతంగల్ మండలంలోని హంగర్గ ఫారం (Hungarga Farm) గ్రామంలో 112 మంది లబ్ధిదారులకు సోమవారం కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తోందన్నారు. చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కాబట్టే హామీల అమలులో నిర్లక్ష్యం చేయట్లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
రేషన్‌కార్డులు అందుకున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు షేక్ సజ్జాత్, కాంగ్రెస్ నాయకులు దిలీప్ కుమార్, గ్రామ పెద్దలు షేక్ వలీవుద్దీన్, బాపురావు, సూరారెడ్డి, డీలర్ శంషొద్దీన్ శంషుద్దీన్, కిషన్, యూత్ నాయకులు ఫెరోజ్, నిసార్, పాషా, మజీద్ కమిటీ అధ్యక్షులు షేక్ మౌలానా, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.