HomeతెలంగాణHyderabad | రోగిని ప్రేమించిన డాక్టర్.. చివరకు ఏమైందంటే?

Hyderabad | రోగిని ప్రేమించిన డాక్టర్.. చివరకు ఏమైందంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | రోగిని ప్రేమించిన ఓ డాక్టర్​.. ఆమె జీవితం విషాదంతం అయింది. మానసిక సమస్యలతో ఉన్న అతడిని మాములు మనిషిని చేసిన ఆమె.. వేధింపులు భరించలేక భవనంపై నుంచి దూకింది. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad)​ నగరంలో చోటు చేసుకుంది.

ఆమె ఓ సైకాలజిస్ట్(Psychologist)​.. ఇతరుల మానసిక సమస్యలను నయం చేస్తుంది. కానీ జల్సాలకు అలవాటు పడిన భర్తను మార్చలేకపోయింది. ప్రేమించి పెళ్లాడిన తనను వేధిస్తుండటంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. నగరంలోని సనత్​నగర్​(Sanatnagar)కు చెందిన రజిత సైకాలజిస్ట్​గా పని చేస్తోంది. ఆమె గతంలో ఓ ఆస్పత్రిలో ఇంటర్న్​గా ఉన్నప్పుడు రోహిత్​ అనే వ్యక్తి మానసిక సమస్యలతో ఆస్పత్రికి వచ్చాడు. దీంతో ఆయనకు వైద్యం చేసి మాములు మనిషిని చేసింది రజిత. అనంతరం రోహిత్ ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పాడు. దీంతో ఆయన మాటలు నమ్మిన రజిత ఓకే చెప్పింది. ఇద్దరు పెళ్లి చేసుకొని కొంతకాలం ఆనందంగా గడిపారు.

Hyderabad | జాబ్​ మానేసి జల్సాలు

పెళ్లయిన కొన్నాళ్లకు రోహిత్ తన ఉద్యోగం మానేశాడు. డాక్టర్​ అయిన రజిత డబ్బులతో జల్సాలు చేయడం ప్రారంభించాడు. మానసిక సమస్యలతో తన దగ్గరికి వచ్చే ఎంతో మందిని మాములు మనుషులుగా చేసిన రజిత.. తన భర్తలో మాత్రం మార్పు తేలేకపోయింది. జల్సాలు మానాలని చెప్పినా అతను వినలేదు. అంతేగాకుండా డబ్బు కోసం వేధించడం ప్రారంభించాడు. దీంతో మనోవేదనకు గురైన రజిత జులై 28న ఇంటిపై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె బ్రెయిన్​ డెడ్​ అయినట్లు వైద్యులు తాజాగా తెలిపారు. దీంతో ఆమె తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.కాగా రజిత తండ్రి నర్సింహగౌడ్​ ఓ పోలీస్​ స్టేషన్​లో ఎస్సైగా పని చేస్తున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.