అక్షరటుడే, ఇందూరు: School Games | క్రీడల్లో జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలని డీఈవో అశోక్ (DEO Ashok) అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) ఆధ్వర్యంలో సోమవారం టీఎన్జీఎస్ భవన్లో వార్షిక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య వ్యత్యాసం లేకుండా క్రీడా పోటీలను నియమనిబంధనలతో నిర్వహించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో చదువుతోపాటు క్రీడలు ప్రధాన అంశంగా తీసుకోవాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు బాధ్యతతో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలని సూచించారు.
డీసీఈబీ కార్యదర్శి సీతయ్య మాట్లాడుతూ.. ఈ విద్యాసంవత్సరం క్రీడా రుసుం చెల్లించని వారు తొందరగా చెల్లించాలని కోరారు. అనంతరం ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి 2024- 25 బడ్జెట్ జమాఖర్చుల వివరాలను వెల్లడించారు. అలాగే గతేడాది ఎస్జీఎఫ్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో టీజీ పేట అధ్యక్ష కార్యదర్శులు గోపిరెడ్డి, శ్రీనివాస్, పీడీపీఈటీ (PDPET) అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాంచారి శ్రీనివాస్, కృష్ణంరాజు, రాజు, భారతి, ఇందిరా, నీరజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.