అక్షరటుడే, ఇందూరు: Comprehensive Education| ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు శిక్షణ నిచ్చే విషయంలో జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంవో) బాలకృష్ణ పేర్కొన్నారు. సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులర్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ సీడబ్ల్యూఎస్ఎన్(Curricular and Therapeutic Strategies for CWSN) (చైల్డ్ విత్ స్పెషల్ నీడ్) అనే అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థుల (Disabled students) పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రావ్ మాట్లాడుతూ.. ఈ శిక్షణ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ శ్రీధర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (Hyderabad Public School) ప్రిన్సిపాల్ ప్రవీణ్, స్టేట్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ జయరాం నాయక్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ (డీఆర్పీ)లు శ్రీనివాస్ రెడ్డి, మురళి, మమత, ప్రకాష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.