అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | అభివృద్ధిలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాలని, ఇందుకు ప్రతి అధికారి నిబద్దతతో పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. నగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మంగళవారం సుభాష్ నగర్లోని (Subhash Nagar) క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
Mla Dhanpal | వేగంగా అభివృద్ధి పనులు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు. రహదారుల అభివృద్ధి, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ ఈఈ సుదర్శన్ రెడ్డి, రోడ్ల భవనాల శాఖ డీఈ ప్రవీణ్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.