అక్షరటుడే, కామారెడ్డి: Collector Kamareddy | సమిష్టిగా జిల్లాను అభివృద్ధి పథంతో నడపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. నూతన సంవత్సరం (New Year) సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలుపగా.. వారితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాను అభివృద్ధి పర్చడంలో ప్రతి ఒక్క ఉద్యోగికి బాధ్యత ఉందని పేర్కొన్నారు.
Collector Kamareddy | జీవన ప్రమాణాలు పెంచేలా..
కొత్త ఏడాదిలో జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో చందర్ నాయక్, సీపీవో రఘునందన్, డీపీఆర్వో తిరుమల, సివిల్ సప్లయ్స్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, హార్టికల్చర్ జిల్లా అధికారికి జ్యోతి, డీవైఎస్వో వెంకటేశ్వర గౌడ్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, డీఈవో రాజు, ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, భూగర్భ జలశాఖ అధికారి సతీష్, హౌజింగ్ పీడీ విజయ పాల్ రెడ్డి, ఇండస్ట్రియల్ మేనేజర్ లాలూ, బీసీ కార్పొరేషన్ అధికారి జయరాజ్, ఆడిట్ అధికారి రామకృష్ణ, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.