ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Pawan Kalyan | ‘రప్పా.. రప్పా.. నరుకుతాం’పై జోరుగా న‌డుస్తున్న చ‌ర్చ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రాంగ్...

    Pawan Kalyan | ‘రప్పా.. రప్పా.. నరుకుతాం’పై జోరుగా న‌డుస్తున్న చ‌ర్చ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pawan Kalyan | మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లపై తీవ్ర‌మైన విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు జగన్ వెళ్లిన సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమా డైలాగైన ‘రప్పా.. రప్పా నరుకుతాం’ బ్యానర్లను ప్రదర్శించారు. 2029లో తాము అధికారంలోకి వస్తే నరికేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించడంపై టీడీపీతో పాటు కూటమి నేతలు మండిపడుతున్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు నాయుడు(CM Chandrababu Naidu) కూడా తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్(Former CM Jagan) సైతం సినిమా డైలాగును వాడితే తప్పేముందని ప్రశ్నించారు? ఈ ప్రభుత్వంలో సినిమా డైలాగులు కూడా వాడడం నేరమేనా? అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

    Pawan Kalyan | స‌హించేదే లేదు..

    రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించేవారిని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan) స్పష్టం చేశారు. అటువంటి వారిని ప్రజలు నిశితంగా గమనించాలని, అసాంఘిక శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను కట్టడి చేయకపోగా, వాటిని సమర్థించేలా మాట్లాడే వారి నేరపూరిత ఆలోచనలను ప్రజలు గమనించాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమేనన్న విషయాన్ని ఎవరూ మరచిపోరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.

    సినిమా డైలాగులు(Cinema dialogues) హాల్​లో వినటానికే బాగుంటాయి.. నిజ జీవితంలో ఆచరించడానికి కాదంటూ డిప్యూటీ సీఎం పవన్ కౌంటర్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించి విద్వేషపూరిత ప్రసంగాలు చేసే నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరైనా చట్టాన్ని నియమ నిబంధనలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న ఉద్దేశం ఏమిటో ప్రజలు గుర్తించాలని డిప్యూటీ సీఎం కోరారు. అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సినిమా డైలాగులను ఆచరణలో పెడతామంటే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ప్రభుత్వం నిర్దేశించినట్లు పవన్ వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని అవసరమైతే రౌడీ షీట్లు తెరుస్తామని పవన్ స్పష్టం చేశారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా, వారిని సమర్థించేలా మాట్లాడే వారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని పవన్ కోరారు. జ‌గ‌న్​కు కౌంట‌ర్​గా ప‌వ‌న్ ఈ కామెంట్స్ చేయ‌గా, ఎక్క‌డ కూడా ఆయ‌న జ‌గ‌న్ పేరు తీయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...