Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | నగరంలో ముగ్గురు బాలికల మిస్సింగ్​ కలకలం..!

Nizamabad City | నగరంలో ముగ్గురు బాలికల మిస్సింగ్​ కలకలం..!

నగరంలో ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్​ ఘటన కలకలం సృష్టించింది. కోటగల్లీలోని హాస్టల్​ నుంచి బుధవారం సాయంత్రం బయటకు వెళ్లిన విద్యార్థినులు తిరిగి రాలేదని సమాచారం.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో ముగ్గురు బాలికల మిస్సింగ్​ కలకలం రేపుతోంది.  కోటగల్లి బాలికల పాఠశాలలో (Kotagally Girls High School) ఉన్న వెనకబడిన తరగతుల వసతిగృహం (Backward Classes Hostel) నుంచి ముగ్గురు బాలికలు తప్పిపోయినట్లు తెలుస్తోంది.

బుధవారం సాయంత్రం నుంచి వారు కనిపించకుండా పోయారని సమాచారం. పదో తరగతికి చెందిన ఇద్దరు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని హాస్టల్​ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని సమాచారం.

Nizamabad City | ఆఘమేఘాల మీద పోలీసులకు సమాచారం..!

బయటకు వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్​కు రాకపోవడంతో విషయాన్ని వసతిగృహ అధికారులు ఆలస్యంగా గుర్తించినట్లు సమాచారం. వెంటనే వారు పోలీసులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వసతి గృహంలోని సీసీ కెమెరాలను పరిశీలించినట్లుగా తెలిసింది. ఈ మేరకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్​స్టేషన్​కు వెళ్లినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.