అక్షరటుడే, ఆర్మూర్ : Rations Cards | కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డు బదిలీల్లో ఇబ్బందులను తొలగించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేష్ రెడ్డి కోరారు. సోమవారం రాజ్యసభ (Rajya Sabha)లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ సమస్యను సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ, కొత్త, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు.
సురేష్‌రెడ్డి (Suresh Reddy) గతంలో ఇచ్చిన ఉత్తరంతో ఈ విషయాన్ని ఇప్పటికే పరిశీలించామన్నారు. దీనికి సంబంధించి అవసరమైన మార్పులు చేయాలని సంబంధిత శాఖాధికారులకు సూచించామని ఆయన పేర్కొన్నారు. రేషన్‌కార్డ్ కోడింగ్ టీమ్ (Ration Card Coding Team)ను దిశానిర్దేశం చేశారు. కొత్తగా పెళ్లయిన వారికి ఈ ప్రక్రియతో లాభం జరుగనుందని ఆయన తెలిపారు.