అక్షరటుడే, వెబ్డెస్క్ : Dhurandhar 2 teaser | బాలీవుడ్లో ‘ధురంధర్’ మూవీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ మూవీ స్వీకెల్ అయిన ‘ధురంధర్–2’ టీజర్ తాజాగా రిలీజైంది. ఈ టీజర్లో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) మరింత వయలెన్స్ ఫర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. కాగా.. పార్ట్–1 చిత్రం ఏకంగా రూ. 1,400 కోట్ల కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
Dhurandhar 2 teaser | భారీ అంచనాలతో..
తాజాగా విడుదలైన ‘ధురంధర్ 2’ టీజర్.. ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని మరింత పెంచింది. యాక్షన్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్.. అన్ని కలిసి ప్రేక్షకులకు వేరే లెవల్ అనుభూతి అందిస్తున్నాయి. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధార్ దర్శకత్వం (Directed Aditya Dhar)లో ధురంధర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న ధురంధర్ రివెంజ్ మూవీ టీజర్ (Movie Teaser) ను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది.
ఈ టీజర్ మూవీపై భారీ అంచనాలు పెంచుతోంది. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది.టీజర్లో ‘ఇది నూతన భారతదేశం (India) సరిహద్దులు దాటి ఇంట్లోకి చొరబడుతుంది, దెబ్బ కొడుతుంది’ అనే డైలాగ్ హైలెట్గా నిలిచింది. ఈ మూవీ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడదల కానుంది. హిందీతో ఆపటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సైతం విడుదల చేయనున్నారు.