అక్షరటుడే నిజామాబాద్ క్రైం : DGP Shivadhar Reddy | రాష్ట్ర డీజీపీ శశిధర్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం పర్యటించారు. ఐజీ చంద్రశేఖర్‌తో కలిసి జిల్లాకు విచ్చేసిన ఆయన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్ రూరల్, మాక్లూర్ పోలీస్స్టేషన్లను ప్రారంభించారు.

DGP Shivadhar Reddy | స్వాగతం పలికిన సీపీ సాయిచైతన్య..
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) డీజీపీ శివధర్‌రెడ్డితో పాటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి స్వాగతం పలికారు. సుమారు రూ. కోటి నిధులతో నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో నిర్మించిన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను అలాగే మాక్లూర్‌లో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (Shabbir Ali), సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy), ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy), ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా నరేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఆయా పోలీస్స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
