ePaper
More
    HomeతెలంగాణParty defections | ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా.. నోటీసులు ఇచ్చే యోచనలో స్పీకర్​

    Party defections | ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా.. నోటీసులు ఇచ్చే యోచనలో స్పీకర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Party defections | బీఆర్​ఎస్ (BRS)​ నుంచి గెలిచి కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ (Speaker Prasad)​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.

    రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ అయితే బీఆర్​ఎస్​ నుంచి గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్​ నుంచి ఎంపీగా పోటీ చేశారు. స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారగా.. ఆయన కూతురు ఎంపీ టికెట్​ పొంది గెలిచారు. వీరితో పాటు పోచారం శ్రీనివాస్​ రెడ్డి, సంజయ్​కుమార్, తెల్లం వెంకట్రావ్, అరికపుడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాశ్​గౌడ్​, మహిపాల్​రెడ్డి, కృష్ణమోహన్​రెడ్డి బీఆర్​ఎస్​ను వీడి హస్తం గూటికి చేరారు.

    Party defections | సుప్రీంకోర్టు తీర్పుతో..

    పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘకాలం వాదనలు విన్న కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​కు సూచించింది. ఈ మేరకు గత నెల 31న తీర్పు చెప్పంది. సుప్రీం తీర్పు మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్​ నోటీసులు (Notice) ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ఆయన న్యాయ సలహా (Legal Advice) తీసుకున్నట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాలని స్పీకర్​ నిర్ణయించారు. అనంతరం ఆయన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు.

    Latest articles

    Kamareddy Collector | మున్సిపాలిటీలో డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Collector | మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...

    Delhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేసా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి పాల్పడిన రాజేష్ ఖిమ్జీ...

    Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి దిగువకు నీటి విడుదల...

    Jagadeesh Reddy | క‌మీష‌న్ల కోస‌మే యూరియా కొర‌త‌.. కాంగ్రెస్ చేత‌గానిత‌నంతోనే రైతుల‌కు క‌ష్టాలన్న జ‌గ‌దీష్‌రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagadeesh Reddy | కాంగ్రెస్ ప్ర‌భుత్వ చేత‌గానితనంతోనే యూరియా కొర‌త ఏర్ప‌డింద‌ని మాజీ మంత్రి...

    More like this