Homeజిల్లాలుకామారెడ్డిCPS | సీపీఎస్​ను వెంటనే రద్దు చేయాలి.. ఉద్యోగ సంఘాల డిమాండ్​

CPS | సీపీఎస్​ను వెంటనే రద్దు చేయాలి.. ఉద్యోగ సంఘాల డిమాండ్​

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: CPS | ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్​ను వెంటనే రద్దు చేయాలని ఎంప్లాయీస్​ జేఏసీ (Employees JAC) జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవో (TNGO’s Nizamabad) జిల్లా అధ్యక్షుడు సుమన్​ కుమార్​ డిమాండ్ చేశారు. పెన్షన్​ విద్రోహ దినాన్ని (Pension Rebellion Day) పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్​ ఎదుట నల్ల టీషర్ట్స్​, బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్​ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్​ విధానాన్ని (OPS) వెంటనే అమల్లోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఈ సందర్భంగా ఉద్యోగులు పేర్కొన్నారు. అనంతరం సుమారు 400 మంది ఉద్యోగులతో వారు హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి బయలుదేరారు.

కార్యక్రమానికి టీజీఈజేఏసీ (TGEJAC) జిల్లా కో–ఛైర్మన్లు రమణ్​ రెడ్డి, సురేష్, కృష్ణారెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, మోహన్, TGEJAC జిల్లా కార్యవర్గ సభ్యులు నేతికుంట శేఖర్, శ్రీకాంత్, వినోద్, ప్రశాంత్, బాలయ్య, అమృత్ కుమార్, చిట్టి నారాయణరెడ్డి, నాగరాజు, పోల శ్రీనివాస్, జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, స్వామి, మాణిక్యం, శంతన్, వినీత, శశికాంత్ రెడ్డి, సృజన్ కుమార్, రాజశేఖర్, ప్రవీణ్ రాజ్, జ్ఞానేశ్వర్ రెడ్డి, సూర్య ప్రకాష్, మంజుల, ఇందిర, గీతారెడ్డి శ్రీవేణి, పద్మ, విజయలక్ష్మి, శ్రీప్రియ తదితరులు హాజరయ్యారు.

CPS | ఎల్లారెడ్డి నుంచి..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: CPS | సీపీఎస్​ను రద్దు చేయాలని ఉపాధ్యాయులు నినదించారు. హైదరాబాద్​లోని ఇందిరా పార్క్ (Indira Park) వద్ద తలపెట్టిన ధర్నాకు పీఆర్టీయూ (PRTU) ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి (Yellareddy) నుంచి ఉపాధ్యాయులు సోమవారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెన్షన్ ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు.

20 ఏళ్లుగా సీపీఎస్‌ ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్నారని, పాత పెన్షన్‌ విధానాన్ని(ఓపీఎస్)  అమలుచేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఎల్లారెడ్డి మండలం నుంచి ప్రత్యేక వాహనాలలో ఉపాధ్యాయులు హైదరాబాద్​లో జరుగనున్న ధర్నాకు వెళ్లారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, నరేష్, లక్ష్మణ్, నాగరాజు, వినయ్, వేణు తదితరులు పాల్గొన్నారు.

CPS | భీమ్​గల్​ నుంచి..

CPS

అక్షరటుడే, భీమ్​గల్: మండలం​ నుంచి ఉపాధ్యాయులు హైదరాబాద్​లో (Hyderabad) నిర్వహించనున్న ధర్నాకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పట్ల శాపంగా మారిన సీపీఎస్​ను తొలగించి పాత పెన్షన్ విధానం ఓపీఎస్​ను అమలు చేయాలని వారు డిమాండ్​ చేశారు. పీఆర్​టీయూ టీఎస్​ (PRTUTS) రాష్ట్ర శాఖ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teacher MLC) పింగిలి శ్రీపాల్​రెడ్డి పిలుపుమేరకు ధర్నాకు వెళ్తున్నట్లు వారు పేర్కొన్నారు.

హైదరాబాద్​కు తరలివెళ్లిన వారిలో పీఆర్​టీయూ టీఎస్​ భీమ్​గల్​ మండల అధ్యక్షుడు ఎడ్ల శేఖర్, ప్రధాన కార్యదర్శి కర్నాల శ్రీనివాస్ మండల కార్యవర్గ సభ్యులు కాశీరాం, వాసుదేవ్, రవీందర్, వినోద్​, టీచర్లు శ్రీనివాస్ రాజశేఖర్, ప్రశాంత్, ఇమాన్యుల్, వినోద్ సాగర్, భూపతి, సాగర్, నరసింహ పాల్గొన్నారు.