అక్షరటుడే, బాన్సువాడ : Banswada CPI | రైతుల సాయుధ పోరాటంలో సీపీఐ ప్రధాన పాత్ర పోషించిందని నియోజకవర్గ ఇన్ ఛార్జి దుబాస్ రాములు పేర్కొన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (Communist Party of India) ఆవిర్భవించి వందేళ్లు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం బాన్సువాడ (Banswada)లో వేడుకలు నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని సీపీఐ కార్యాలయం (CPI Party Office)లో జెండాను ఎగరవేశారు.
Banswada CPI | కార్మికుల వైపే మేమున్నాం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కీలక పోరాటాలు నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. బ్యాంకుల జాతీయకరణ, దున్నేవాడికి భూమి, కార్మికులకు శ్రమకు తగిన వేతనం, వెట్టి చాకిరి నిర్మూలన వంటి అనేక ప్రజాస్వామ్య ఉద్యమాలు తమ పార్టీ నిర్వహించిందన్నారు.
తెలంగాణ (Telangana) ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటం ద్వారా లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిన ఘన చరిత్ర సీపీఐదని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు, కార్మిక సంఘాల సభ్యులు నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి డి.శంకర్, రేణుక, సురేఖ, శివాజీ, అడుపల్లి రాజు, వెంకటి, కాశీరాం, రాజు, గంగారాం తదితరులు పాల్గొన్నారు.