అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జిల్లాలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌శాఖ (Police Department) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం బోధన్ డివిజన్లో (Bodhan Division) జరిగిన మొదటి విడత పోలింగ్ సరళిని సీపీ పర్యవేక్షించారు. కమిషనరేట్ కార్యాలయంలోని (Commissionerate Office) కమాండ్ కంట్రోల్ రూంలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ బూత్‌లలో పరిస్థితిని పరిశీలించారు. ఆయా పోలీంగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు.
CP Sai Chaitanya | స్వేచ్ఛాయుత వాతావరణంలో..
అనంతరం సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేవిధంగా పోలీస్‌శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఆయా ప్రాంతాల్లో పోలీస్ అధికారులు (Police Officers) చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సైతం స్వేచ్ఛగా ఓటు వేసేలా కృషి చేశామని వెల్లడించారు.