అక్షరటుడే, ఆర్మూర్ : CP Sai Chaitanya | ఆర్మూర్ డివిజన్ (Armoor Division) పరిధిలో మూడో విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ క్రమంలో నందిపేట్, బాల్కొండ, మోర్తాడ్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ (Armoor Police Station) పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సీపీ సాయిచైతన్య సందర్శించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించిన సీపీ పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
CP Sai Chaitanya | కౌంటింగ్‌కు ఇబ్బందుల్లేకుండా చూడాలి..
ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కౌంటింగ్ చివరి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా జరిగేందుకు నిక్కచ్చిగా విధులు నిర్వహించాలన్నారు. సీపీ వెంట అదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావు (Additional DCP Ramachandra Rao), ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐలు శ్రీధర్ రెడ్డి, విజయ్ బాబు, ఎస్సైలు రాము, వెంకట్రావు, వినయ్, శైలేందర్, ఐకే రెడ్డి, ఆర్వో అధికారులు చంద్రమోహన్, పండరి, సంతోష్ ఉన్నారు.