అక్షరటుడే నిజామాబాద్ సిటీ : Mega Lok Adalat | జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి భారత ప్రభుత్వం (India Government) నిర్వహిస్తున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని సూచించారు.
ఈనెల 21న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్లో చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు (Traffic Challans), మైనర్ క్రిమినల్ కేసులు (Minor Criminal Cases), సివిల్ తగాదాలు వంటి వాటిని సులభంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఇది శాంతియుత పరిష్కార విధానమని, ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని వివరించారు. రాజీమార్గమే రాజమార్గమని ఆయన సూచించారు. కావున జాతీయ మెగా లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.