ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​TUCI | దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారబోస్తున్న కేంద్ర ప్రభుత్వం

    TUCI | దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారబోస్తున్న కేంద్ర ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే ఇందూరు: TUCI | కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారపోస్తోందని టీయూసీఐ జాతీయ అధ్యక్షుడు అమ్రిష్ పటేల్ ఆరోపించారు. టీయూసీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం రాజీవ్ గాంధీ ఆడిటోరియం (Rajiv Gandhi Auditorium) నుంచి పాత కలెక్టరేట్ మైదానం వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగాన్ని పెంచుతున్నారన్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే స్టేషన్లు అన్ని ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. అందుకే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

    TUCI | కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి

    ప్రధాని మోదీ విధానాలు గత ప్రభుత్వాల కంటే ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయని అమ్రిష్​ పటేల్​ మండిపడ్డారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను (Anti labor laws) తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్ లను, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, సూర్యం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, పద్మ, హనుమేష్, సహాయ కార్యదర్శి రాజన్న, రామయ్య, వెంకటేశ్​, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర నాయకులు వెంకన్న, రాజేశ్​, ముత్తన్న, మల్లేశ్​, యాకోబు షావలి, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this